నీ కారు సీటు కాపాడుకోవడానికి కడియం శ్రీహరిని విమర్శించడం మానుకో- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రం ప్రసాద్
ధర్మసాగర్ , మేజర్ న్యూస్, బిఆర్ఎస్ పార్టీలో నీ కారు సీటు కాపాడుకోడానికి లేనిపోని విమర్శలు కడియం శ్రీహరి పై చేయకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజయ్యకు హితవు పలికారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు రాజయ్య విమర్శలపై ధ్వజమెత్తారు.ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో కమిషన్లు తీసుకున్న రాజయ్య దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుందని ఎద్దేవా చేశారు. సోమవారం ధర్మసాగర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో డాక్టర్ టీ రాజయ్య చేసిన వ్యాఖ్యలను ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితబంధు, బీసీ బంధు వంటి పథకాల అమలులో పేద ప్రజల నుంచి కమిషన్లు తీసుకున్న చరిత్ర రాజయ్యదేనని వారు విమర్శించారు. అభివృద్ధి పనుల్లోనూ కమిషన్లు అందిన తర్వాతే శంకుస్థాపనలు చేసేవారంటూ ఆరోపించారు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన టెక్స్‌టైల్ పార్కు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుండి పరకాలకు తరలిపోవడానికి కూడా రాజయ్య వ్యవహారశైలే కారణమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజయ్య చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందడంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన కృషి కీలకమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేవాదుల జలాల వల్లే నియోజకవర్గంలోని వ్యవసాయానికి భరోసా లభిస్తోందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మాట్లాడే ముందు గతంలో జరిగిన పరిణామాలపై రాజయ్య ఆత్మపరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెసరు రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, పెద్ద పెండ్యాల సర్పంచ్ తోట నాగరాజు లు విలేకరుల సమావేశంలో రాజా విమర్శలపై ఘాటుగా స్పందించారు. దేవాదుల సృష్టికర్త ముమ్మాటికి కడియం శ్రీహరి అన్న మాట రాజయ్య గుర్తుంచుకోవాలని అన్నారు. నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే బిఆర్ఎస్ నేతలు వారి ఉనికిని కాపాడుకోవడానికి కడియం శ్రీహరిని విమర్శిస్తున్నారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బత్తిని ఎలా గౌడ్, ధర్మపురం యాకోబు, బొడ్డు ప్రదీప్ కుమార్, కుమార్, బొడ్డు లెనిన్, పుట్ట కుమార్, రమేష్, శ్యామల మహేందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
*ధర్మసాగర్ రిపోర్టర్ కొట్టే పద్మయ్య, హనుమకొండ జిల్లా