నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు!
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 1వ డివిజన్ కొత్త కాలువ సెంటర్ నందు 45 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక ప్రజలు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 1వ డివిజన్ అభివృద్ధి పనులకు 16 కోట్ల 90 లక్షల రూపాయలను కేటాయించాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాము. ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే కూటమి అభ్యర్థులకు ఓటు వేసి విజయాన్ని అందించండి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ కుడుముల చిరంజీవి, కో క్లస్టర్ ఇంచార్జ్ తంబి శ్రీనివాసులు, 1వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు జావిద్, కోడూరుపాడు పీఏసీఎస్ సొసైటీ చైర్మన్ గంగి జయరామిరెడ్డి, శ్రీ ఇరుకలల పరమేశ్వరిఅమ్మవారి దేవస్థానం చైర్మన్ ఓట్టూరు సురేంద్ర యాదవ్, టీడీపీ నాయకులు ముచ్చకాయల వేణు యాదవ్, కంటేపల్లి సీనయ్య, జబ్బర్, దంతు విజయ కుమార్ యాదవ్, సురేష్, తంబి శ్రీనివాసులు, గౌస్, మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.