BREAKING
నంద్యాల ఆటోనగర్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట- రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేకాట స్థావరంపై టాస్క్‌ ఫోర్స్ పోలిసుల దాడి: ముగ్గురు అరెస్ట్‌ నీ కారు సీటు కాపాడుకోవడానికి కడియం శ్రీహరిని విమర్శించడం మానుకో- జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుర్రం ప్రసాద్ కావలి మున్సిపల్ చైర్మన్ రేసులో కండ్లగుంట మధుబాబు నాయుడు.. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ! హకీంపేటలో భారీ వ్యవసాయ మేళాకు సన్నాహాలు.. స్థలాన్ని పరిశీలించిన సురేంద్ర మోహన్, గోపి ఐఏఎస్‌లు, కలెక్టర్ దీపక్ తివారి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తాం మార్కెట్ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు పేదల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు గుండా మల్లేష్ కామ్రేడ్ గుండా మల్లేష్‌కు సీపీఐ నాయకుల ఘన నివాళులు కాకిలేరు పోలింగ్ బూత్ లు తనిఖీ చేసిన డీ ఎస్ పి నర్సింహమూర్తి గూడూరు పురపోరులో కూటమి ఆశీస్సులు ఎవరికి? రాయల్ నగరంలో ఘర్షణ.. తెదేపా కార్యకర్తలపై దాడి కలకలం! గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా? నెల్లూరు రూరల్ అభివృద్ధికి రూ.45 లక్షలతో మరో అడుగు! నిశ్చితార్థ వేడుకల్లో అచ్చమాంబ దేవస్థానం చైర్మన్ అడుసుమల్లి కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ

మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా?

Select Suryaa Now
మాల, మాదిగలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదా?

మున్సిపల్ రిజర్వేషన్లలో ఎస్సీ స్థానాలు లేకపోవడంపై మాల మహానాడు నేత జేష్టాది భాస్కర్ ఆగ్రహం!

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

అట్టడుగు వర్గాలను ఆదుకుంటున్నామని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించే విషయంలో మాత్రం మాల, మాదిగ సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నాయా? అంటూ మాల మహానాడు చెన్నయ్య వర్గం కడప జిల్లా అధ్యక్షుడు జేష్టాది భాస్కర్ ప్రశ్నించారు. కడప జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన రిజర్వేషన్ల ప్రక్రియలో ఒక్క ఎస్సీ స్థానం కూడా లేకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఎస్సీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశంపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ప్రకటించే ప్రభుత్వాలు, రాజకీయ అధికారంలోనూ వారికి తగిన అవకాశాలు కల్పించాలని భాస్కర్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పథకాలు అందించడం మాత్రమే కాకుండా, నిర్ణయాధికార వ్యవస్థల్లోనూ అట్టడుగు వర్గాలకు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాల, మాదిగ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న భావన కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మున్సిపల్ రిజర్వేషన్ల అంశాన్ని పునఃపరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా సామాజిక న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జేష్టాది భాస్కర్ డిమాండ్ చేశారు.

  • ఎ ప్రతాప్ కుమార్ ప్రొద్దుటూరు అర్బన్ వైఎస్సార్ కడప జిల్లా