గ్రామీణ రహదారులకు ప్రాధాన్యం.. రూ.75 లక్షలతో రోడ్డు, కల్వర్టు నిర్మాణం గత పాలకుల నిర్లక్ష్యానికి ఈ కల్వర్టే సాక్ష్యం: ఎమ్మెల్యే అమిలినేని
కంబదూరు : జల్లిపల్లి నుంచి మేళ్లకుంట గ్రామం వరకు రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు భూమిపూజ చేశారు. వీబీ జీ రామ్ జీ పథకం కింద చేపట్టనున్న ఈ పనులతో గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో తెగిపోయిన కల్వర్టుల మరమ్మతులు, గ్రామీణ రహదారుల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. జల్లిపల్లి–మేళ్లకుంట మార్గంలోని కల్వర్టు సమస్యను గ్రామస్థులు తన దృష్టికి తీసుకురాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను కోరిన వెంటనే రూ.75 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
కంబదూరు మండలానికి చెందిన స్థానిక నాయకులు, గ్రామస్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.