'ఇందిరమ్మ'' రెండో విడతలో ఇర్విన్ కు ప్రాధాన్యత ఇవ్వండి
- ఎమ్మెల్యే కు వినతి*
ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మాడ్గుల మండలంలో మేజర్ గ్రామపంచాయతి అయిన ఇర్విన్ కు ప్రాధాన్యతనివ్వాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ బావండ్లపల్లి కోటయ్య, ఉపసర్పంచ్ గాదెమోని దళపతి గౌడ్ లు బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి విన్నపించారు. ఈ మేరకు మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు భట్టు కిషన్ రెడ్డి తో కలిసి వారు ఇర్విన్ జి.పి పరిధిలోని ఇర్విన్, దిల్ వార్ ఖాన్ పల్లి, రెడ్డిపురం, గాంగ్యనగర్ తాండలలో ఇండ్లు లేని నిరుపేదల వివరాలను ఎమ్మెల్యే కసిరెడ్డికి వివరించి అర్హులైన ప్రతి ఒక్కరికి రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల