మంత్రి నారాయణను కలిసిన ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై వినతి
మార్కాపురం, మేజర్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) కార్యాలయంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు.నియోజకవర్గంలోని ప్రజల అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎరిక్షన్ బాబు.. ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రి పొంగూరు నారాయణకు అందజేశారు.నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. సమస్యలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి నారాయణను కలిసిన సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.