గ్రామ కంఠం భూమిని కాపాడండి
– అధికారులు తక్షణమే స్పందించాలి
కామ్రేడ్ దిలీప్ కుమార్
రాంపూర్ గ్రామపంచాయతీ సంగాయిపల్లి గ్రామంలోని గ్రామ కంఠం భూమిపై నెలకొన్న అనుమానాలకు వెంటనే తెరదించాలని, పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి వాస్తవ భూమి విస్తీర్ణాన్ని గ్రామ ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని కామ్రేడ్ దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రామస్తులు వివరాల ప్రకారం గ్రామ కంఠం మొత్తం విస్తీర్ణం సుమారు 12 ఎకరాలు ఉండగా, ప్రస్తుతం 8 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు కామ్రేడ్ దిలీప్ కుమార్ తెలిపారు. మిగిలిన సుమారు 4 ఎకరాల భూమి ఏమైందో అధికారులు అధికారిక రికార్డుల ఆధారంగా తేల్చాలని డిమాండ్ చేశారు. గ్రామ కంఠం విషయంలో ఎలాంటి అక్రమాలకు, ఆక్రమణలకు తావు లేకుండా వెంటనే అధికారిక సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని ఆయన అన్నారు. సర్వే అనంతరం గ్రామ కంఠం భూమి వివరాలను ప్రజలకు బహిరంగంగా తెలియజేయాలని కోరారు. గ్రామ కంఠానికి సంబంధించిన భూ సమస్యపై కలెక్టర్, ఎంపీడీఓ, తహసిల్దార్, సర్పంచ్‌లకు వినతిపత్రాలు అందజేసినా సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ కంఠం భూమి విషయంలో నిర్లక్ష్యం చేస్తే గ్రామ ప్రజలతో కలిసి మరింత బలమైన పోరాటం చేపడతాం అని గ్రామ కంఠం భూమి పూర్తిగా గుర్తించిపరిరక్షించే వరకు మా పోరాటం ఆగదు అని కామ్రేడ్ దిలీప్ కుమార్ ఉన్నారు.
- చప్పిడి తిరుపతి : మేజర్ న్యూస్, తలకొండపల్లి.