BREAKING
2047 నాటికి 'వికసిత్ భారత్' సాధ్యమే: 5 కీలక ప్రాధాన్యతలను వెల్లడించిన ప్రధాని ముఖ్య కార్యదర్శి-2 శక్తికాంత దాస్ మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు పెట్టుబడులతో పౌరసత్వం: సరికొత్త ఆఫర్ ప్రకటించిన అర్జెంటీనా కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నేడు యధావిధిగా పీజీఆర్ఎస్ అమలాపురం అయ్యప్ప స్వామి ఆలయంలో 72 రోజుల పాటు ఉచిత బిక్ష: 16న మహాకుంభాభిషేకం కంటి వెలుగుకి సేవా సంకల్పం అత్యంత వైభవంగా శ్రీ సత్యదేవుని రథసేవ గుంతలో పడితే అంతే వైసీపీకి షాక్ ఇచ్చిన కూటమి. ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో వైసీపీ నుండి కూటమిలోకి పలువురు చేరిక. గంజాయి సేవిస్తున్న ఏడుగురు వ్యక్తులు అరెస్ట్ నాణ్యత లోపంతో పాడైన రోడ్డును పరిశీలించిన చిర్ల జగ్గిరెడ్డి... Rangullo medicine నాలుగు దశాబ్దాల సేవకు ... ఆత్మీయ వీడుకోలు పరామర్శించిన ముదునూరి ప్రసాద్ రాజు

ఎస్టి బాయ్స్ హాస్టల్ విద్యార్థులను చితకబాదిన వార్డెన్

Select Suryaa Now
ఎస్టి బాయ్స్ హాస్టల్ విద్యార్థులను చితకబాదిన వార్డెన్

ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో వార్డెన్ ప్రతాపం.
* కొద్ది రోజులుగా విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడి.

దుమ్ముగూడెం (సూర్య మేజర్ న్యూస్):
మండల పరిధిలోని దుమ్ముగూడెం ప్రభుత్వ ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో వార్డెన్ నిర్వాకం తీవ్ర కలకలం రేపింది.వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న గిరిజన విద్యార్థులపై వార్డెన్ విచక్షణా రహితంగా చేయిచేసుకుని చితకబాదిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.బాధిత విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులను వార్డెన్ చిన్న చిన్న కారణాలకే అసభ్య పదజాలంతో దూషిస్తూ దారుణంగా కొడుతున్నట్లు వాపోయారు. ఆదివారం సుబ్బారావు పేట గ్రామానికి చెందిన ఓ విద్యార్థి హాస్టల్ గదిలో తుమ్మినందుకు, మరొక విద్యార్థి సౌండ్ చేసినందుకు వాళ్లపై వార్డెన్ దాడి చేశారు.అంతేకాకుండా, సాయంత్రం 4 గంటల సమయంలో క్రీడా పరికరాల వద్ద ఆడుకుంటున్న మరికొందరు విద్యార్థులపైనా ప్రతాపం చూపారు.ఈ దృశ్యాలను గమనించిన దమ్ముగూడెం గ్రామానికి చెందిన స్థానిక యువకులు అడ్డుకుని, విద్యార్థులను ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించగా.. "మా విద్యార్థులు, నా ఇష్టం" అంటూ వార్డెన్ తీవ్ర నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని స్థానికులు తెలిపారు.దాడి తీవ్రతకు కొందరు విద్యార్థుల శరీరాలపై తీవ్ర గాయాలు కాగా,విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
పిల్లలకు రక్షణగా ఉండాల్సిన వార్డెనే ఇలా రాక్షసంగా వ్యవహరించడంపై మండిపడుతున్నారు. గతంలో చర్ల మండలం సత్యనారాయణపురంలో పనిచేస్తున్న సమయంలో కూడా ఈ వార్డెన్ విద్యార్థులపై ఇలాగే శాడిజం చూపేవాడని గ్రామస్తులు ఆరోపించారు. పిల్లలను దారుణంగా కొట్టిన సదరు వార్డెన్‌పై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

*ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న వార్డెన్*
ఈ ఘటనపై వివరణ కోరేందుకు వార్డెన్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా,ఆయన తన సెల్ ఫోన్‌‌ను స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులోకి రాకుండా పోయారు.