BREAKING
అమెరికాలో వైద్య రంగానికి 3బిలియన్ డాలర్లు ప్రకటించిన బెక్షన్ డికిన్సన్ ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి!

మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు

Select Suryaa Now
మంచిర్యాలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భిణీ మృతి.. నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

 మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. చికిత్స కోసం వచ్చిన గర్భిణీ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

బాధితురాలు గుడిపేట గ్రామానికి చెందిన మహిళగా తెలుస్తోంది. గర్భంలో శిశువు మృతి చెందినట్లు వైద్యులకు ముందే తెలిసినప్పటికీ, అత్యవసరంగా ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ కుటుంబ సభ్యురాలు ప్రాణం కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాల నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.