BREAKING
ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి!

ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌ నిరసన జ్వాల.. నేడు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ముట్టడి:డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పిలుపు

Select Suryaa Now
ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌ నిరసన జ్వాల.. నేడు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ముట్టడి:డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పిలుపు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, మేజర్‌ న్యూస్‌,( అక్టోబర్ 06):ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు.

ఇందులో భాగంగా మేడ్చల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట డీసీసీ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో భారీ మార్చ్‌, నిరసన ధర్నా నిర్వహించనున్నారు.

ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణకే పోరాటం

ఈ సందర్భంగా వజ్రేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే ఆందోళన ప్రజల్లో నెలకొందన్నారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం, ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చూడటం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే తమ పోరాటం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో చోటుచేసుకున్న అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం స్పందించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.

భారీగా తరలిరావాలని పిలుపు

మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, డీసీసీ సభ్యులు, డివిజన్‌ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్‌, మహిళా కాంగ్రెస్‌, ఎస్సీ, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వజ్రేష్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.అలాగే ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.