BREAKING
అమెరికాలో వైద్య రంగానికి 3బిలియన్ డాలర్లు ప్రకటించిన బెక్షన్ డికిన్సన్ ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి!

ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు

Select Suryaa Now
ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు

 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా సాగాలని పిలుపు.. ప్రభుత్వ అండదండలు ఉంటాయని హామీ!
సూర్య అమరావతి బ్యూరో: అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగురవేస్తూ తెలుగుజాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన ప్రముఖ ఆర్చర్, గోల్డెన్ గర్ల్ వెన్నం జ్యోతి సురేఖను రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా అభినందించారు. జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకం సాధించిన జ్యోతి సురేఖ, ఆమె తండ్రి సురేంద్రకుమార్‌లు సోమవారం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జ్యోతి సురేఖను మంత్రి శాలువాతో సత్కరించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆర్చరీ విభాగంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో హోరాహోరీగా తలపడి పసిడి పతకం సాధించడం ద్వారా మన దేశానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని ఖ్యాతిని తీసుకువచ్చారని ప్రశంసించారు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి నిలకడగా రాణిస్తూ దేశానికి పతకాలు అందిస్తున్న ఆమె కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

రాబోయే 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా కఠోర సాధన చేయాలని, ఒలింపిక్ వేదికపై బంగారు పతకం ముద్దాడేలా ముందుకు సాగాలని జ్యోతి సురేఖకు మంత్రి ఆకాంక్షించారు. ఆమె శిక్షణ, అంతర్జాతీయ పోటీల సన్నద్ధతకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ భేటీపై జ్యోతి సురేఖ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.