BREAKING
డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి! అమెరికా రాజకీయాల్లో పోస్టల్ ఓటింగ్ పై డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు అమెరికాలో నోలన్ వెల్స్ మృతి కేసు గ్రాండ్ జ్యూరీ తీర్పుపై కుటుంబ సభ్యుల నిరసన రోజూ రాగి జావ తాగుతున్నారా? ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలతో పాటు ఎవరు దూరంగా ఉండాలో తెలుసా? ఎస్‌ఐఆర్‌లో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్‌ నిరసన జ్వాల.. నేడు మేడ్చల్‌ కలెక్టరేట్‌ ముట్టడి:డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ పిలుపు దక్షిణ కొరియాలో కలకలం సంచలన సైబర్ దాడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం తైవాన్ కీలక ప్రకటన చిన్న భాగాలుగా విడగొట్టడంపై ఎలాంటి సమాచారం లేదు వాకలపుడిలో గాలి 219! ఇప్పుడు ఎంత? అమెరికాలో వలసదారులకు భారీ ఊరట డోనాల్డ్ ట్రంప్ సర్కార్ జరిమానాలపై ఫెడరల్ జడ్జి స్టే ప్రముఖ ఇంగ్లిష్ రచయిత జెఫ్రీ ఆర్చర్ కన్నుమూత.. సాహిత్య ప్రపంచంలో విషాదం బస్సు టాప్ పై విద్యార్థులు.. తాకే దూరంలో విద్యుత్ తీగలు. దాదా సెట్‌లో బాలయ్య.. రేపటి నుంచి ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్ నేడు వికారాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ:డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ నాయక్ మహాకావ్య శ్రీ రామాయణ కథ సినిమాపై నెగెటివ్ మార్కెటింగ్ ప్రచారం: నిర్మాత ప్రకాష్ మహోబియా సంచలన ఆరోపణలు

గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త.. బాలికల హాస్టల్, గ్రంథాలయం సమీపంలోనే వ్యర్థాల పారబోత!

Select Suryaa Now
గ్రామాల్లో పేరుకుపోతున్న చెత్త.. బాలికల హాస్టల్, గ్రంథాలయం సమీపంలోనే వ్యర్థాల పారబోత!

వెల్దుర్తి ప్రతినిధి మేజర్ న్యూస్ మండల పరిశుభ్రత లోపించి గ్రామంలోని వీధులు దుర్గంధభరితంగా మారుతున్నాయి. ఊరి చివరన కానీ, కేటాయించిన ప్రాసెసింగ్ యార్డుల్లో కానీ పారబోయాల్సిన చెత్తను అధికారుల నిర్లక్ష్యం వల్ల నేరుగా బాలికల హాస్టల్, స్థానిక గ్రంథాలయం సమీపంలోనే కుప్పలుగా పారబోస్తున్నారు. దీనివల్ల ఇటు విద్యార్థినులు, అటు పాఠకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పేరుకుపోతున్న రోగాలు - ఆందోళనలో విద్యార్థినులు

బాలికల హాస్టల్ పరిసరాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా ఈగలు, దోమలు, పందులకు నిలయంగా మారింది. దోమల తీవ్రత పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర సాంక్రామిక రోగాలు వ్యాపించే అవకాశం ఉందని హాస్టల్ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదువుపై తీవ్ర ప్రభావం

మరోవైపు గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థినులకు నిరంతరం వచ్చే దుర్గంధం వల్ల చదువుపై ఏకాగ్రత నిలపలేకపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, హాస్టల్ మరియు గ్రంథాలయం వద్ద ఉన్న చెత్తను తొలగించి, నిర్దేశిత ప్రాసెసింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సూర్య ప్రతినిధి షేక్ దస్తగిరి వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా