BREAKING
ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి!

బస్సు టాప్ పై విద్యార్థులు.. తాకే దూరంలో విద్యుత్ తీగలు.

Select Suryaa Now
బస్సు టాప్ పై విద్యార్థులు.. తాకే దూరంలో విద్యుత్ తీగలు.

కళ్యాణదుర్గం టౌన్ ప్రతినిధి :-

శెట్టూరు మండలం చింతర్లపల్లి వంక దాటిన అనంతరం మలుపు సమీపంలో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ తీగలు బస్సు టాపుపై ప్రయాణిస్తున్న విద్యార్థులకు తాకేంత సమీపంలో ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అదే సమయంలో రహదారిపై వెళ్తున్న వాహనదారులు పరిస్థితిని గమనించి బస్సు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఈ బస్సులో కనుకూరు, ముచ్చర్లపల్లి, కరిడిపల్లి, చింతర్లపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు నిత్యం శెట్టూరులోని పాఠశాలలకు రాకపోకలు సాగిస్తుంటారు. విద్యార్థుల ప్రయాణ సౌకర్యం కోసం బస్సును ఏర్పాటు చేసినప్పటికీ, అదే బస్సులో సాధారణ ప్రయాణికులను కూడా అధిక సంఖ్యలో ఎక్కించుకోవడంతో రద్దీ పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. సోమవారం బస్సు లోపల ప్రయాణికులతో పూర్తిగా నిండిపోవడంతో కొంతమంది విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో బస్సు టాపుపైకి ఎక్కి ప్రయాణించారు. ఈ క్రమంలో చింతర్లపల్లి వంక దాటిన తర్వాత మలుపు వద్ద రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్ తీగలు బస్సు టాపుపై ఉన్న విద్యార్థులకు అత్యంత సమీపంగా వచ్చాయి. వాహనదారులు వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఒక్క క్షణం ఆలస్యమైనా విద్యుత్ తీగలు విద్యార్థులను తాకి ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సు రద్దీని నియంత్రించడంతో పాటు అవసరమైన మేరకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. విద్యార్థులు బస్సు టాపుపై ప్రయాణించకుండా అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను సంబంధిత అధికారులు పరిశీలించి సురక్షితమైన ఎత్తులో ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.