BREAKING
ఆస్ట్రేలియా రాజకీయాల్లో సంచలనం వలసల కోతపై ప్రతిపక్షం కీలక ప్రకటన డీఎంజీ సరిహద్దు పేలుడు ఘటన తీవ్రత ఉత్తర కొరియా బేషరతు క్షమాపణ కోరేలా దక్షిణ కొరియా వ్యూహం 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి: ఆర్చరీ గోల్డెన్ గర్ల్ జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు ఐపీవో జీఎంపీ ట్రెండ్: ఎస్‌ఆర్‌ఐటీ ఇండియా వర్సెస్ షా ఇన్వెస్టర్స్ హోమ్.. లిస్టింగ్ లాభాల్లో ఏది ముందంజ? రియాద్ ఎయిర్‌పోర్ట్, ఆరామ్‌కో రిఫైనరీలపై భారీ దాడులు: ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ నిరసన. బెస్ట్ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ గా ప్రసాద్ ఫ్లైదుబాయ్ విమానంపై దాడి వెనుక ఇరాన్ హస్తం: డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు అలాస్కా గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు జేడీ వాన్స్ పూర్తి మద్దతు: ఆసియా మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ ఎగుమతులే లక్ష్యం అమెరికా-జపాన్ సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం: ఈసీఎల్‌జీఎస్ 5.0 కింద బ్యాంక్ రుణాల విడుదలను వేగవంతం చేయండి: జుట్టు రాలే సమస్య, చుండ్రుతో బాధపడుతున్నారా? ఈ సులభమైన ఇంటి చిట్కాలతో శాశ్వత పరిష్కారం! డిజిటల్ భారత్‌లో సరికొత్త రికార్డు: 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు.. ట్రాయ్ వార్షిక నివేదికలో వెల్లడి! చర్మానికి ఇన్స్టంట్ గ్లో రావాలా? పసుపు ఐస్ క్యూబ్స్‌తో ఇలా మ్యాజిక్ చేయండి!

జనార్ధనపురములో సుమారు రూ.7కోట్ల స్మశాన భూమికబ్జా

Select Suryaa Now
జనార్ధనపురములో సుమారు రూ.7కోట్ల స్మశాన భూమికబ్జా

జనార్ధనపురంలో శ్మశాన భూమి కబ్జా: ₹7 కోట్ల దోపిడీపై కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు!

నందివాడ-మేజర్ న్యూస్ :
కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్ధనపురం గ్రామంలో శ్మశాన వాటిక (రుద్రభూమి) భూముల దోపిడీ పరాకాష్టకు చేరింది. నిరుపేదల అంతిమ సంస్కారాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసి, అక్రమ దందాలకు వేదికగా మార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గ్రామంలోని రీ సర్వే నెంబర్ 99 లో ఉన్న 6 ఎకరాల ప్రభుత్వ శ్మశాన భూమి చట్టప్రకారం 22(ఎ) నిషేధిత భూముల జాబితాలో ఉంది. అయితే, కొందరు అక్రమార్కులు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల లోపాయికారీ సహకారంతో ఏకంగా షుమారు ₹7 కోట్ల విలువైన 1.50 ఎకరాల శ్మశాన భూమిని ఆక్రమించారు. దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని, అందులో ఇళ్లు కూడా నిర్మించారు.
గత ప్రభుత్వంలో మాజీ మంత్రి కొడాలి నానికి ముఖ్య అనుచరుడిగా చలామణి అయిన కొల్లారెడ్డి అంజిరెడ్డి అనే వ్యక్తి ఈ శ్మశాన భూమిలోనే ఎలాంటి అనుమతులు లేకుండా బోరు తవ్వి, అక్రమంగా కమర్షియల్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ నిర్మించినట్టు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు రోజుకు వేల లీటర్ల అసురక్షిత నీటిని విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నాడు. కమర్షియల్ టాక్స్ కట్టకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడన్నారు. రీ సర్వే సమయంలోనే గ్రామస్థులు ఫిర్యాదు చేసినా, మామూళ్ల మత్తులో ఉన్న రెవెన్యూ, విద్యుత్, పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ సహా మొత్తం 8 శాఖల అధికారులు ఆ ఫిర్యాదులను తొక్కిపెట్టారని మహిళ చెబుతుంది.
ఈ భారీ అవినీతి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు గ్రామ మహిళామండలి సభ్యురాలు దేశిమాల రోజాపుష్పం నడుం బిగించారు. ఆమె నేరుగా కృష్ణా జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్ (స్పందన) ద్వారా పూర్తి ఆధారాలతో ఫిర్యాదు సమర్పించారు. శ్మశాన భూమిని కబ్జా చేసిన వారితో పాటు, అవినీతికి సహకరించిన 8 శాఖల అధికారులపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదుతో అక్రమార్కులు, అధికారుల గుండెల్లో వణుకు మొదలైంది. ఫిర్యాదులోని పై విషయాలని ఆమె మీడియాకు వివరించారు.