BREAKING
స్థలం ఆక్రమించారని ఆరోపణ హెచ్‌ఎస్‌బీసీ యూకే వెల్త్ మేనేజ్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత సౌత్ కొరియాలో ఏఐ టూల్స్‌తో మెగా చర్చిల డేటా చోరీ జపాన్‌లోని ఒకినావాలో అమెరికా సైనికులకు కఠిన ఆంక్షలు కెనరా బ్యాంక్ నుంచి జేఎన్‌టీయూ సీఈఏకు మూడు డిజిటల్ బోర్డులు వేంకటేశ్వరస్వామి టెంపుల్ లో పూజలు శ్రీ చిన్నజీయర్ స్వామీజీని కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నెల 12న ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర దివ్యక్షేత్ర శంకుస్థాపన, భూమిపూజ; స్వామీజీకి ఆహ్వానం జగిత్యాల కు మూడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ ముఖ్యమంత్రి వృద్ధుల సేవలో వికాస్ అనితర సాధ్యం ఉక్రెయిన్ రాజధాని కైవ్‌పై రష్యా విరుచుకుపడ్డం నేటితో మోదీ పాలనకు 25 ఏళ్లు: అభినందనలు తెలిపిన కేంద్ర కేబినెట్‌ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పేరిట ఇంద్రకీలాద్రిలో ఖడ్గమాల అర్చన - శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ ఢిల్లీలో రాహుల్‌, ప్రియాంక అరెస్ట్, విడుదల.. ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు

2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి:

Select Suryaa Now
 2029 నాటికి ప్రభుత్వ బడులన్నీ 4-స్టార్ స్థాయికి:

ఏడాదిలోగా వన్-స్టార్ పాఠశాలల అప్‌గ్రేడ్.. సమీక్షలో మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు   

సూర్య అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చి, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య, మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల పురోగతిపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జీరో-స్టార్ రేటింగ్ ఉన్న అన్ని పాఠశాలలను కనీసం వన్-స్టార్ స్థాయికి తీసుకురావాలని, ఏడాది కాలంలోగా రాష్ట్రంలోని వన్-స్టార్ పాఠశాలలన్నింటినీ టూ-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని దిశానిర్దేశం చేశారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 4-స్టార్ మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పక్కా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ఇందులో కనీసం వెయ్యి పాఠశాలలను అత్యున్నత 5-స్టార్ స్థాయికి చేర్చాలని స్పష్టం చేశారు. 

ముఖ్యంగా ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 175 'లీప్ స్కూళ్లను' (LEAP Schools) పైలట్ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని దాదాపు 7 వేల ఉన్నత పాఠశాలల్లో పూర్తిస్థాయి కంప్యూటర్ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు.   మరోవైపు విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలను పెంపొందించడంపై మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.

 కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ (PMKVY), పీఎం ఇంటర్న్‌షిప్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్‌లను విస్తృతంగా వినియోగించుకుంటూ.. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. నిరుద్యోగ యువతను ‘నైపుణ్యం పోర్టల్’ పరిధిలోకి తీసుకొచ్చి ఏఐ (AI) ఆధారిత ఇంటర్వ్యూలు నిర్వహించేలా చూడాలని, సీడాప్ మరియు ఓంక్యాప్ సంస్థల ద్వారా జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా చొరవ చూపాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ సీఈవో నారాయణస్వామి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.