గోదావరి డెల్టా ఆధునీకరణకు సమగ్ర కార్యాచరణ - జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
గోదావరి డెల్టాలో శాశ్వత ముంపు సమస్యకు పరిష్కారం చూపే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.13.4 కోట్ల వ్యయంతో నిర్వహించిన లైడార్ సర్వే ఆధారంగా డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం విజయవాడ లోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, గోదావరి డెల్టా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఐఐఎస్‌సి టెక్నాలజీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.