వృద్ధుల సేవలో వికాస్ అనితర సాధ్యం
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
నెలా క్రమం తప్పకుండా వృద్ధులు, వికలాంగులకు ఉదారంగా పించన్లు అందిస్తున్న వికాస్
సొసైటీ కృషి అనితర సాధ్యమని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ప్రాపట్టణక్టు డైరెక్టర్ టి.కనక రాజు అన్నారు.
వికాస్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో
బుధవారం స్థానిక వీఎల్
పురం పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చేతుల మీదుగా
200 మంది వృద్దులకు
రూ 300/ చొప్పున పించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి వృద్ధులకు పించన్లు ఇవ్వడం అభినందనీయమన్నారు.
ఎవరైనా ఆపదలో కొట్టుమిట్టాడుతుంటే కొందరు వీడియో తీసి
రీల్స్ చేస్తున్నారు తప్ప
బాధితుడిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడే ప్రయత్నం చేయకపోవడం
విచారకరమన్నారు.
అలాంటి సంస్కృతి ద్వారా
సమాజానికి వారిచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. దాని నుంచి
విడివడి సమాజానికి తమ వంతు సేవలు అందిస్తే అదే జీవితానికి సార్థకత కనక రాజు అన్నారు . ఇదే సందర్భంగా.. ఇటీవల మృతి చెందిన వృద్ధురాలు పైడితల్లి కుటుంబానికి
2000/ మట్టి ఖర్చుల కింద
సహాయాన్ని ఆయన చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్నేహశ్రీ
స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ సూర్య వేణి,ఈద మనోహర్,
గోదావరి స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ,
కొట్టేటి శ్రీనివాస్, దుళ్ళ రవి ,
డాక్టర్ జగదీష్, చల్లా వెంకటేశ్వర్లు, అంబటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.