BREAKING
గ్లోబల్ వార్మింగ్ కట్టడికి అత్యవసర చర్యలు....వాతావరణ సదస్సులో హెచ్చరికలు బాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెపో సంస్కరణలపై హెడ్జ్ ఫండ్స్ హెచ్చరిక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక మైలురాయి కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం అమెరికాలో తగ్గుతున్న లగ్జరీ వస్తువుల కొనుగోళ్లు ఉగాండా డాంగోట్ రిఫైనరీలో వాటాల విక్రయానికి గ్రీన్ సిగ్నల్ బిగ్ టెక్ దిగ్గజాలపై బ్రస్సెల్స్ పన్ను పంజా ప్రజల నమ్మకమే నా అతిపెద్ద బలం: ఎలన్ మస్క్ టెరాఫాబ్ వెంచర్‌తో కలిసి పనిచేయనున్న ఇంటెల్ మయన్మార్ సైనిక పాలకులు మలేషియాలో అడుగు ఫ్రాన్స్‌కు ఆర్థిక తప్పిదాలకు తావు లేదు: సిటాడెల్ హెచ్చరిక పామెనలో కరెంటు కష్టాలు! స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ కీలక భేటీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో గుంజ పూజ కార్యక్రమం కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ డౌన్‌..పట్టించుకునేదెప్పుడు…?

కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ డౌన్‌..పట్టించుకునేదెప్పుడు…?

Select Suryaa Now
కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ డౌన్‌..పట్టించుకునేదెప్పుడు…?

లిఫ్ట్‌ పనిచేయక ప్రజలు, ఉద్యోగుల మెట్ల కష్టాలు

వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు తప్పని ఇబ్బందులు.. శాశ్వత పరిష్కారంపై డిమాండ్‌

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ పనిచేయకపోవడంతో ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే కలెక్టరేట్‌లో లిఫ్ట్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో పై అంతస్తులకు వెళ్లేందుకు మెట్లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.కలెక్టరేట్‌లోని వివిధ శాఖలకు వెళ్లే ఉద్యోగులు, ధ్రువపత్రాలు, ఫిర్యాదులు, ఇతర ప్రభుత్వ పనుల కోసం వచ్చే ప్రజలు లిఫ్ట్‌ పనిచేయక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు మెట్లు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వాపోతున్నారు.

తరచూ అదే సమస్య..

కలెక్టరేట్‌లో లిఫ్ట్‌కు తరచూ సమస్యలు తలెత్తుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లిఫ్ట్‌ పనిచేయని ప్రతిసారీ ఉద్యోగులు, ప్రజలు మెట్లపైనే ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు. అత్యవసర పనులపై కలెక్టరేట్‌కు వచ్చే వారు సైతం లిఫ్ట్‌ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే జిల్లా కలెక్టరేట్‌లోనే కనీస సౌకర్యమైన లిఫ్ట్‌ సక్రమంగా పనిచేయకపోవడంపై సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పునరావృతమవుతుండటంతో అసలు శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించాలి

లిఫ్ట్‌ సమస్యపై జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలని ఉద్యోగులు, ప్రజలు కోరుతున్నారు. లిఫ్ట్‌ను వెంటనే మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు భవిష్యత్తులో తరచూ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షణ, నిర్వహణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి లిఫ్ట్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.