BREAKING
సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం డిజిటల్ సాంకేతికతను బోధనతో అనుసంధానం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత ఆర్థిక ఇబ్బందులతో యువకుడి మృతి మొక్కలతోనే సమాజ మనుగడ. *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం మహానంది పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానానికి రూ. 10,116 విరాళం జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ.. సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య? పైకప్పు కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ తొలగించిన ఓటర్ల జాబితాలో ప్రతి పేరును పునఃపరిశీలించాలి పంటలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్

కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం..కోళ్ల ఫారం వద్ద గ్రామస్తుల ఆందోళన

Select Suryaa Now
కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం..కోళ్ల ఫారం వద్ద గ్రామస్తుల ఆందోళన

కుకునూరుపల్లి, మేజర్ న్యూస్: సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోని బొప్పాయిపల్లి చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులోని జానకి కోళ్ల ఫారం నుండి భరించలేని వ్యర్ధాలతో దుర్వాసన ఈగలతో  వెలువడుతున్నడంతో  రెండు  గ్రామాల ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా దాని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఇరు గ్రామల ప్రజలు ఆరోపిస్తున్నారు. కోళ్ల ఫారం సమీపంలో పచ్చి కోడేరు ఆరబెట్టడంతో భగ్గుమన్న దుర్వాసన వెదజల్లడంతో చుట్టుపక్కల ఉన్న పొలల్లో వ్యవసాయ పనులు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు దుర్వాసన ఈగలతో రోగాల బారిన పడుతున్నామని ఆరోపిస్తున్నారు. నిబంధనలకు మేరకు గత నెలలో మూడుసార్లు గ్రామాల్లో వీధుల్లో దోమలు ఈగలు ప్రబాల కుండ పాగింగ్ చేయాల్సి ఉంది. పౌల్ట్రీ ఫారం యజమాన్యం ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆయా గ్రామల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అందించి దుర్వాసన నిలుబడుతున్న కోళ్ల ఫారాలపై చప్రమదకరం కోళ్ల పారాలపై  చర్యలు తీసుకొని విధిగా పాగింగ్ చేయించి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.