మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం
మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం
వైయస్సార్సీపి ఎమ్మిగనూరు ఇన్చార్జి రాజీవ్ రెడ్డి
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
కరువు విలయ తాండవం చేస్తుంటే పాలక ప్రభుత్వానికి కనిపించదా.. స్థానిక ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి కళ్ళు మూసుకొని తిరుగుతున్నారా.. నియోజకవర్గ రైతాంగం పై ఆయనకున్న కపట ప్రేమ బయటపడింది కావున ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే వరకు వైఎస్ఆర్సిపి విశ్రమించే పరిస్థితి ఉండదని ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాల రైతులతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శివ సర్కిల్లో బైఠాయించి రైతుల సమస్యపై ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో జిల్లా అంత కరువు ఉంటే కేవలం 15 మండలాలు ప్రకటించి చేతులు దులుపుకోవడం ఏమిటని దుయ్యబట్టారు. ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే 100% పంటల బీమా వసూళ్లు అయ్యాయని చెప్పుకుంటున్న పాలకులు రైతుల సొమ్ము నిలువున దోచుకున్నారని అర్థం అవుతుంది అన్నారు.పంటలు నష్టపోతేనే కదా రైతు బీమా ప్రీమియం చెల్లించేది ఆ మాత్రం పాలక నాయకులకు తెలియదా అంటూ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో గోనెగండ్ల నందవరం ఎమ్మిగనూరు మండల రైతులను ఆదుకోవాల్సింది పోయి మైకు దొరికితే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సాగునీటి ఒనర్లు సక్రమంగా లేని ఆదోని డివిజన్లో ఎమ్మిగనూరు ప్రాంతాన్ని ఎందుకు కరువ ప్రకటించలేక పొయ్యారన్నారు. ఇప్పటికి కూడా హెచ్చరిస్తున్నాం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను కరువు మండలం కిందకు తీసుకు రాకపోతే వైసీపీ పోరాటాలకు సిద్ధమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ బసి రెడ్డి, కేఆర్ లక్ష్మీకాంతరెడ్డి, కేఆర్ నటరాజ్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూరా అహ్మద్, రియాజ్, బుట్టా రంగయ్య, సునీల్ కుమార్, విరుపాక్షి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.