జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, అర్హులైన పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొడంగల్ అసెంబ్లీ SIR కోఆర్డినేటర్ మాణిక్యం మల్లేష్ యాదవ్ పాల్గొన్నారు.