BREAKING
ఏపీకి వర్ష సూచన విజయ్ సేతుపతి ‘భత్తా’ 7 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు: వారంలో ₹14 కోట్లకు పైగా వసూళ్లు యూఏఈ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమాచారం లేకుండానే విద్యుత్తు కోతలు స్థానిక సంస్థల ఎన్నికల పై బీజేపీ కసరత్తు- బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశం డిజిటల్ సాంకేతికతను బోధనతో అనుసంధానం చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత ఆర్థిక ఇబ్బందులతో యువకుడి మృతి మొక్కలతోనే సమాజ మనుగడ. *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మూడు మండలాలు కరువుగా ప్రకటించే వరకు విశ్రమించం మహానంది పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానానికి రూ. 10,116 విరాళం జాదవ్ ధారా సింగ్ నాయక్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ.. సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య?

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత

Select Suryaa Now
ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు: ప్రయాణికులను కాపాడిన కన్నుమూత

సూర్య, అనకాపల్లి:కాకినాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. ప్రయాణంలో ఉండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అప్రమ4త్తమైన ఆయన, చాకచక్యంగా వ్యవహరించి బస్సును రహదారి పక్కన సురక్షితంగా ఆపేశారు. దీంతో బస్సులోని ప్రయాణికులందరూ ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు.

అనంతరం తోటి సిబ్బంది, ప్రయాణికులు ఆయనను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. తన ప్రాణాలు పోతున్న సమయాల్లోనూ ప్రయాణికుల సురక్షతకే ప్రాధాన్యమిచ్చి ప్రమాదాన్ని తప్పించిన డ్రైవర్ శ్రీనివాస్ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని పలువురు కొనియాడారు.