ఏపీకి వర్ష సూచన
అమరావతి, సూర్య ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకు బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది.
మరొకవైపు, వర్షాలు కురిసినప్పటికీ రాష్ట్రంలో భానుడి ప్రతాపం తగ్గదని, పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.