BREAKING
సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత పీడీఎస్‌ బియ్యం పట్టివేత నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక అనంత నగరంలో పింక్ టాయిలెట్లు.. టెండర్ ప్రక్రియకు అహుడా గ్రీన్ సిగ్నల్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చైర్మన్ టి సి వరుణ్, వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్ హైదరాబాద్‌లో భూకబ్జా కలకలం: హీరో కుటుంబంపై ఫ్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు ఎల్ఎండి ఇన్‌చార్జ్ ఎస్సై గా అరుణ్ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతుల విరాళం అన్నదానానికి రూ.1,00,116 సమర్పణ మహానంది క్షేత్రంలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో, చైర్మన్

ఏడేళ్ల తర్వాత ఇంటికి చేరిన మహేందర్

Select Suryaa Now
ఏడేళ్ల తర్వాత ఇంటికి చేరిన మహేందర్


శారద ఫౌండేషన్ సేవలతో కుటుంబ సభ్యుల చెంతకు..
సూర్య వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముకుల గ్రామానికి చెందిన బొంగోని మహేందర్ మతిస్థిమితం కోల్పోయి సుమారు ఏడేళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.ఈ క్రమంలో గురువారం ఉదయం మహారాష్ట్ర నుంచి మహేందర్ తన స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గత ఏడేళ్లుగా మహేందర్‌కు శారద ఫౌండేషన్ ప్రతినిధులు ఆశ్రయం కల్పిస్తూ అవసరమైన చికిత్స, సంరక్షణ అందించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫౌండేషన్ సేవలతో మహేందర్ కోలుకుని సాధారణ స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఏళ్ల తర్వాత మహేందర్‌ను చూసిన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అతడిని కుటుంబానికి తిరిగి చేర్చడంలో సేవలందించిన శారద ఫౌండేషన్ ప్రతినిధులకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ సభ్యులను ఘనంగా సన్మానించి వారి సేవలను అభినందించారు.