హైదరాబాద్‌లో భూకబ్జా కలకలం: హీరో కుటుంబంపై ఫ్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సూర్య ప్రతినిధి :
గోపనపల్లి రంగనాథ్ నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. తమ ఫ్లాట్లను ఒక ప్రముఖ సినీ హీరో కుటుంబం కబ్జా చేసిందంటూ బాధితులు, ఫ్లాట్ ఓనర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలో ఇక్కడ 60 ఎకరాల్లో గ్రామ్‌పంచాయతీ (జీపీ) అనుమతులతో వెంచర్ ఏర్పాటు చేయగా, స్థల యజమానులకు తెలియకుండా రాత్రికి రాత్రే చుట్టూ ఫెన్సింగ్ వేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
తమ స్వంత స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఓనర్లు, "మా ఫ్లాట్లు మాకు కావాలి" అంటూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని హీరో కుటుంబం ఆక్రమించిన స్థలాలను తిరిగి తమకుప్పగించి, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.