BREAKING
ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్ సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం వరి పంటకు సస్యరక్షణే కీలకం బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం మళ్లీ రాబోతున్న సేనాపతి.. 'భారతీయుడు 3'పై మేకర్స్ క్రేజీ అప్‌డేట్ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి అభ్యర్థన మేరకు మచిలీపట్నం – కర్నూలు మధ్య కొత్త రైలు సేవలకు ఆమోదం రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఐటీ షాక్.. ప్రైమ్ ఫోకస్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు రాయమాల్పురం పాఠశాలకు మెయిన్ గేటు మరియు ఆర్చి నిర్మాణం ఇండియా కూటమి ఎంపీలకు మల్లిఖార్జున ఖర్గే ఆతిథ్యం: హోటల్ భేటీ అనంతరం మళ్లీ రహదారిపై నిరసనలు బిగ్ బాస్ ఇంట్లో అపూర్వ, షాలినీ మధ్య తీవ్ర వాగ్వాదం.. రసవత్తరంగా మారిన నామినేషన్స్ ఆట పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌

పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన

Select Suryaa Now
పండగ సీజన్ రద్దీకి చెక్: తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక రైళ్లు ప్రకటన

 

హైదరాబాద్, సూర్య :ప్రతినిధి :

దసరా, దీపావళి పండుగల వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా వివిధ మార్గాల్లో ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అలాగే విశాఖపట్నం-బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నవంబర్ 25 వరకు, నర్సాపూర్-తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ను నవంబర్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా, రేపు సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పండుగలకు స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.