BREAKING
ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్ ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్

వరి పంటకు సస్యరక్షణే కీలకం

Select Suryaa Now
వరి పంటకు సస్యరక్షణే కీలకం

వరి పంటకు సస్యరక్షణే కీలకం

కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులుపై రైతులకు అవగాహన

వరి పంటలో ప్రస్తుత దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. గురువారం నోముల గ్రామంలో ఆత్మ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు క్షేత్ర పాఠశాల (పొలం బడి) కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. వరి పంటకు కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెల్లకంకులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. నివారణకు సిఫార్సు చేసిన మందులను సూచించిన మోతాదులో వినియోగించాలని సూచించారు. అలాగే అగ్గి తెగులు సోకకుండా ట్రైసైక్లోజోల్, ఐసోప్రోథియోలేన్ లేదా కాసుగామైసిన్ మందులను పిచికారీ చేయాలని తెలిపారు. నత్రజని ఎరువులను మోతాదుకు మించి వాడొద్దని, పొలంలో నీరు లేకుండా పూర్తిగా ఆరబెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీధర్, స్రవంతి, మండల వ్యవసాయ అధికారి జి. వెంకటేష్, సర్పంచ్ బత్తుల శృతి, ఉపసర్పంచ్ దుర్గ ప్రసాద్, ఏఈఓలు సాయి సిరి, నికిత, లింగస్వామి, రైతులు పాల్గొన్నారు.

ఎర్ర లింగం, సూర్య మేజర్ న్యూస్, మంచాల