సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు
పామూరు, మేజర్ న్యూస్ :
జగద్గిరిగుట్ట సీఐ సురేష్‌ను మండలంలోని బొట్ల గూడూరు గ్రామానికి చెందిన కందిమల్ల మాలకొండ రాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిస్థితిపై సీఐ సురేష్‌తో మాలకొండ రాయుడు చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతిభద్రతలను పరిరక్షించేందుకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ శాంతియుత వాతావరణం కొనసాగించేలా పోలీసు శాఖ చేపడుతున్న చర్యలపై ఈ సందర్భంగా సీఐతో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై కూడా చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి భద్రతకు భరోసా కల్పించేలా పోలీసులు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మాలకొండ రాయుడు అభినందించారు.