BREAKING
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి భుజానికి సర్జరీ తర్వాత ఇటలీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫోటోలు ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా: సమరానికి సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు! డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం

Select Suryaa Now
చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం :

ప్రతిష్టాత్మకమైన ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్‌కు 2026–28 సంవత్సరాలకు ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకమండలి సభ్యులు గురువారం రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)ను తిలక్ రోడ్డులోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే వాసుకు  ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగర అభివృద్ధిలో వ్యాపార, వాణిజ్య రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా వ్యాపారుల సమస్యలను సమన్వయంతో పరిష్కరించేందుకు, నగరంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నా రు. వ్యాపారులకు మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, పార్కింగ్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ఎదురవుతున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే వాసు హామీ ఇచ్చారు. వ్యాపార రంగం అభివృద్ధి చెందితే నగర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నూతన పాలకమండలి చాంబర్ ఆఫ్ కామర్స్‌ను మరింత బలోపేతం చేస్తూ, వ్యాపారుల సంక్షేమంతో పాటు నగర అభివృద్ధిలో భాగస్వామిగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే వాసు ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షులు మద్దుల మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు వంటెద్దు సూరిరాజు, యియ్యపు మురళీధర్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షులు కనకాల రాజా

గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, గౌరవ సంయుక్త కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ (కన్న), కోశాధికారి అల్లంకి నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి పచ్చిగోళ్ల సురేష్‌కుమార్

డైరెక్టర్లు దొండపాటి జయసింహ, యిన్నమూరి ప్రదీప్, భేరూలాల్ జైన్, గునిశెట్టి విజయకిరణ్

డైరెక్టర్లు – శ్రీ మండవల్లి సత్యనారాయణమూర్తి (నాని), మునగ రమేష్, సలాది సుబ్రహ్మణ్యం, తాటి సత్యనారాయణ, ఉప్పులూరి బ్రహ్మాజీ, పామెర్ల వీరవెంకట సత్యనారాయణమూర్తి, పులవర్తి వీరవెంకటేశ్వరరావు (వెంకటేష్), కొంచ దుర్గాప్రసాద్, కొల్లేపల్లి వీరవెంకట సుభాష్, పురోహిత్ హనుమాన్ సింగ్, కొయ్యన కుమారి, ఎక్స్ అఫిషియో డైరెక్టర్ కాలెపు వెంకట వీరభద్రరావు, ట్రస్టుబోర్డు డైరెక్టర్ – గండి బ్రహ్మానందం (రాజా)

ట్రస్టుబోర్డు డైరెక్టర్లు గ్రంధి బ్రహ్మానందం, నూలి శివ మల్లికార్జున (శివ), నామినేటెడ్ ట్రస్టీ యక్కల వీర నాగేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ను కలిసిన వారిలో ఉన్నారు.