మలినం నుండి మణిభూషణం ,చెత్త నుండి సంపద నిర్మాణం
సూర్య న్యూస్ దర్శి.
చెత్తను పారేయకుండా సంపదగా మార్చుకోవాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మేలైన ఎరువులు పొందవచ్చునని డిప్యూటీ ఎంపీడీవో ఆవుల సుధాకర్ అన్నారు. ఎంపీడీవో పి .కల్పన అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మండలంలోని పోతవరము గ్రామంలో గ్రీన్ అంబాసిడర్లకు గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలని, గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి గ్రీన్ అంబాసిడర్ లు ప్రజల్లో పాల్గొన్నారు.