BREAKING
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి భుజానికి సర్జరీ తర్వాత ఇటలీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫోటోలు ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా: సమరానికి సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు! డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు

Select Suryaa Now
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు

ఎమ్మెల్యే మల్‌రెడ్డిపై దుష్ప్రచారం సరికాదు

 

డిసిసి అధికార ప్రతినిధి బైరిక రమాకాంత్ రెడ్డి

 

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిపై సోషల్‌ మీడియాలో వక్రీకరించిన వీడియోతో దుష్ప్రచారం చేయడం సరికాదని డీసీసీ అధికార ప్రతినిధి బైరిక రమాకాంత్‌రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తీరును తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలు, విద్యార్థులతో మాట్లాడారని తెలిపారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థినితో ఎమ్మెల్యే మాట్లాడిన దృశ్యాలను కొందరు కావాలనే వక్రీకరించి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓ విద్యార్థిని గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేయడం తగదన్నారు. వక్రీకరించిన వీడియోలతో దుష్ప్రచారం చేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

✍️ఎర్ర లింగం, సూర్య మేజర్ న్యూస్, మంచాల