BREAKING
ఏపీలో తొలి విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఎల్లుండి పోలింగ్ శైవ క్షేత్రాలకు కార్తీక పౌర్ణమి శోభ గ్రామపంచాయతీ ఎన్నికలపై వైఎస్ఆర్సిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్లు. తలారి రంగయ్య. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్. సమస్యాత్మక గ్రామం నూతిమడుగులో ఎస్సై గోపి యాదవ్ పల్లెనిద్ర. కార్తీక పౌర్ణమి వేడుకలకు శివాలయంలో పోటెత్తిన భక్తులు- ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన -అర్చకులు శ్రీనివాస్ శర్మ పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు...

ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు

Select Suryaa Now
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: బాలీవుడ్‌లో గ్లామర్ తారగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దిశా పటాని తన సినీ ప్రయాణం గురించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాడబ్దం పూర్తి కావొస్తున్న తరుణంలో ఆమె తన కెరీర్ పోకడపై స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమయ్యానని చెప్పిన ఈ భామ, ఇకపై తన పంథా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ఆస్కారం ఉన్న బలమైన, వైవిధ్యమైన పాత్రలు చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించిన దిశా పటాని, ఆ తర్వాత హిందీలో ఎంఎస్ ధోని చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, అందులో ఎక్కువ భాగం గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలే వచ్చాయని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇటీవలే విడుదలైన ఆవారాపన్ 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే ఇన్ని సంవత్సరాల అనుభవంతో తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, ఇకపై ప్రేక్షకుల మనసు హత్తుకునే పాత్రలను ఎంచుకుంటానని తెలిపారు.  

తెరపై కేవలం గ్లామర్ డాల్‌గా కనిపించడమే కాకుండా, కథను ముందుకు నడిపించే కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు దిశా పటాని వెల్లడించారు. పాత్ర ఏదైనా సరే అందులో పూర్తిగా లీనమై వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారాయి. గ్లామర్ ఇమేజ్‌ను పక్కనపెట్టి నటిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్న దిశా ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.