యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి
సూర్య జగిత్యాల ప్రతినిధి: ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనుల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ఎంపీడీఓ, మండల తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.