BREAKING
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి:ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి భుజానికి సర్జరీ తర్వాత ఇటలీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెకేషన్.. వైరల్ అవుతున్న ఫోటోలు ఏపీలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా: సమరానికి సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు! డిగ్రీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి

ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం

Select Suryaa Now
ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం

సూర్య మేజర్ న్యూస్, మంచాల :రేపు జరగనున్న టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్‌ యూనియన్‌ను గెలిపించేందుకు ఇబ్రహీంపట్నం డిపో కార్మికులు సిద్ధంగా ఉన్నారని జేఏసీ నాయకులు తెలిపారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఈదురు వెంకన్న నాయకత్వంలో కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహించి, పీఆర్‌సీతో పాటు పలు డిమాండ్ల సాధనకు కృషి చేశామని వారు పేర్కొన్నారు. గతంలో ఆర్టీసీ యూనియన్ల రద్దు సమయంలో కార్మికుల సమస్యలపై ప్రస్తుత పోటీలో ఉన్న నాయకుల పాత్రను ప్రశ్నించారు. కార్మికుల హక్కుల కోసం జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేసిన ఎంప్లాయీస్‌ యూనియన్‌కు ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో బస్సు గుర్తుకు, స్థానిక స్థాయిలో నిచ్చెన గుర్తుకు ఓటు వేయాలని ఇబ్రహీంపట్నం జేఏసీ నాయకులు యాదగిరి, అశోక్‌, డిపో అధ్యక్షుడు జంగయ్య, కార్యదర్శి పరమేష్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపో నాయకులు కిషన్‌, రమేష్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎర్ర లింగం, సూర్య మేజర్ న్యూస్, మంచాల