BREAKING
ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్ ఢిల్లీలో తీవ్రతరం అవుతున్న నిరసనలు: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు 'ఇండియా' కూటమి డిమాండ్

సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం

Select Suryaa Now
సీపీ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకం

 సూర్య తిమ్మాపూర్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో తిమ్మాపూర్ సీఐ బొల్లం రమేశ్‌, ఎల్‌ఎండీ ఎస్‌ఐ అన్వర్‌తో పాటు ఓ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గురువారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలపై స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్న పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా ఇలాంటి చర్యలు కొనసాగాలని వారు కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.