ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్
సూర్య, లక్షెట్టిపేట : లక్షెట్టిపేటలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు ఏఎస్ఐలుగా పదోన్నతి పొందారు. లక్షట్ పేట సర్కిల్ ఆఫీస్ లో రైటర్ గా పనిచేస్తున్న వసంత్ తో పాటు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మురళి అనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ లో ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందారు. పదోన్నతి పొందిన ఇద్దరికీ లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి తో పాటు ఎస్సై గోపతి సురేష్ ఇద్దరికీ స్టార్ అమర్చి శాలువాలతో సన్మానించి అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే తప్పకుండా పదోన్నతులు లభిస్తాయని ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసి ఉన్నత స్థానాలను అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్తయ్య, అన్వర్ హెడ్ కానిస్టేబుల్ సాంబయ్య రవీందర్, సుభాష్ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు.