బతుకమ్మ, దసరాకు 2,425 ప్రత్యేక బస్సులు
సూర్య కరీంనగర్: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం జేబీఎస్–కరీంనగర్ మధ్య మొత్తం 2,425 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ మేరకు అక్టోబర్ 9 నుంచి 19వ తేదీ వరకు జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు 1,175 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అక్టోబర్ 9న 200, 10న 145, 11న 60, 12న 40, 13న 30, 14న 40, 15న 50, 16న 190, 17న 200, 18న 130, 19న 90 బస్సులు నడుస్తాయి.అదేవిధంగా అక్టోబర్ 21 నుంచి 26వ తేదీ వరకు కరీంనగర్ నుంచి జేబీఎస్‌కు 1,250 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21న 230, 22న 190, 23న 180, 24న 180, 25న 250, 26న 220 బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం టీజీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించి టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుని పండుగ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసుకోవాలని రీజినల్ మేనేజర్ కోరారు.