BREAKING
విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించడమే నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన బేబమ్మ కృతి శెట్టి ఇబ్రహీంపట్నం డిపోలో ఎర్రజెండా ఎగరవేస్తాం సీఐను కలిసిన కందిమల్ల మాలకొండ రాయుడు పోలీస్ వాహనం నంబర్‌తో ప్రైవేట్ కారు చాంబర్ ఆఫ్ కామర్స్ కు తన వంతు సహకారం ఒకరోజు ముందే థియేటర్లలోకి రణ్‌బీర్ కపూర్ 'రామాయణ'.. మేకర్స్ సంచలన నిర్ణయం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పై దుష్ప్రచారం సరికాదు ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది.. ఇకపై ఆ పాత్రలే చేస్తా: గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఆసక్తికర వ్యాఖ్యలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష పోస్ట్ కార్డు ద్వారా మోడీకి సందేశం భవాని మాలదారులకు బిక్ష వడి ఏర్పాటు నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి.. లెజెండరీ నటుడిని స్మరించుకుంటూ భావోద్వేగ ట్వీట్

రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష

Select Suryaa Now
రాహుల్ గాంధీ ,ప్రియాంకపై దాడికి నిరసనగా కోమటిరెడ్డి నిరాహారదీక్ష

సూర్య కరీంనగర్:మోదీ కనుసన్నల్లో జరుగుతున్న ఈసీ అక్రమాలకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేసిన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ లపై పోలీసులచే దాడి చేయించిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముకరంపుర లోని తన కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ మోదీ కనుసన్నల్లో చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ చేసిన తప్పిదాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలీసులచే దాడి చేపించి అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని అటువంటి ఓటు హక్కును కేంద్రం ప్రభుత్వం సీఈసీ ని అడ్డుపెట్టుకుని అన్యాయం చేస్తోందని నరేందర్ రెడ్డి అన్నారు.రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి దేశ ప్రజల పూర్తి మద్దతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఫాం 6 లో 2002 లో ఓటు హక్కు పొందిన వారి వివరాలు నమోదు చేయాలని ఉందని అప్పుడు ఓటు వేయని వారి కుటుంబాల పరిస్థితేంటని,బోగస్ ఫాం 7 ద్వారా బోగస్ సంతకాలు పెట్టి బీజేపీ నాయకులు ఓట్లు కొల్లగొడుతున్నారని నరేందర్ రెడ్డి ఆరోపించారు.అన్ని అక్రమాలకు జ్ఞానేశ్ కుమార్ మద్దతు ఉందని అందుకే జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇదే విధంగా కొనసాగుతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు మేం సిద్దమని నరేందర్ రెడ్డి హెచ్చరించారు.ఈ నిరాహార దీక్ష లో ఎండి తాజ్,కార్పోరేటర్లు వరాల నర్సింగం,పర్వతం మల్లేశం,కాంతాల జగన్ రెడ్డి,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,నిహాల్ అహ్మద్,ఎండి చాంద్,ముక్క భాస్కర్,లాయక్,షబానా మహమ్మద్,కుర్ర పోచయ్య,ముల్కల కవిత,అస్థాపురం తిరుమల,జ్యోతి రెడ్డి,మహాలక్ష్మి,మిరాజ్,జీడి రమేష్,అస్థాపురం రమేష్,గోనె స్వప్న, జిలకర రమేష్,సాయిరాం,భారీ ,బషీర్,హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.