మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ
సూర్య, నంద్యాల బ్యూరో:
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను చైర్మన్ నరాల చంద్రమౌళీశ్వర రెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ముందుగా శ్రీ మహానందీశ్వర స్వామివారికి,శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో శ్రీ కామేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మహానందిలో ఈ నెల 11వ తేదీ నుంచి నుండి 20 వరకు శతచండియాగ పూర్వక నవదుర్గాలంకార,శ్రీ చక్రార్చన,సహస్ర దీపాలంకార పూజలతో శ్రీ కామేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో మధు, పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*