చంద్రబాబు కరువు కనిపించడం లేదా
చంద్రబాబు కరువు కనిపించడం లేదా
నందవరం లో సిపిఐ ధర్నా
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి
ఎల్లినో ప్రభావంతో రాష్ట్రమంతా కరువు సేయాలు అలుముకున్నాయి ఎక్కడ కూడా రైతాంగం లాభపడిన దాఖలాలు లేవు.. వేసుకున్న పంటలన్నీ ఎండిపోయాయి.. ఇంత జరుగుతున్న చంద్రబాబు నాయుడుకి కరువు కనిపించడం లేదా అంటూ సిపిఐ నాయకులు రంగన్న విమర్శించారు. గురువారం మండల కేంద్రం నందవరంలో రైతు సంఘం తో పాటు సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి వనర్లు లేక రైతాంగం అతలాకుతలం అయిందన్నారు. కరువు ఉన్న నేపథ్యంలో పంటల బీమా 100% చెల్లించుకున్న రైతులను బాబు ప్రభుత్వం నట్టేట ముంచే పని చేస్తుందని ఆరోపించారు. తక్షణమే నందవరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు.