telanagana
పీడీఎస్ బియ్యం పట్టివేత
సూర్య కరీంనగర్: నగరంలోని భగత్‌నగర్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వపై సమాచారం మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో భగత్‌నగర్‌కు చెందిన రేవెల్లి అనిల్‌కుమార్, ఇంట్లో సుమారు ఏడున్నర క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించి పట్టుకున్నారు. అనంతరం బియ్యాన్ని కరీంనగర్ వన్‌టౌన్ ఎస్‌ఐకి అప్పగించి రసీదు పొందినట్లు తెలిపారు.