BREAKING
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 879, నిఫ్టీ 288 పాయింట్లు జంప్ అక్టోబర్ 12 నుంచి 21 వరకు పాఠశాలలకు సెలవులు..దసరా సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు గుడుపల్లి–బిసానత్తం రహదారిపై కొండచిలువ ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం మానుకోవాలి స్థానిక ఎన్నికలకు పోలీసుల సన్నద్ధత జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల తనిఖీ.. మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై పరిశీలన ఎస్పీ పి. జగదీష్ ఆదేశాలతో రంగంలోకి రెవెన్యూ, పోలీసు బృందాలు రోజుకో గుడ్డు ఆరోగ్యానికి శ్రీరామరక్ష. దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి గోల్డ్‌మన్ శాక్స్‌లో నాయకత్వ మార్పులపై చర్చ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా. ఇస్కాన్ ఆధ్వర్యంలో దసరా కల్చరల్ క్యాంప్ కుష్టు, బోదకాలు బాధితులకు మానవత చేయూత.. రూ.25 వేల విలువైన మెడికల్ కిట్లు, పాదరక్షలు, పండ్ల పంపిణీ… జక్కంపూడి రామ్మోహన్రావుకు ఘన నివాళులు కృత్రిమ మేధస్సు ఆధారిత అమెరికా స్టాక్ మార్కెట్ బుల్ రన్‌కు నాలుగేళ్లు పూర్తి వృద్ధుల గౌరవం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి శర్వానంద్ ‘భోగి’ నుంచి ఎగిరి వరంగలేసి మాస్ సాంగ్.. యూత్‌ను ఊపేస్తున్న లిరికల్ వీడియో! ప్రొద్దుటూరు లో కొత్త ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక

Select Suryaa Now
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక

నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక                                  

 

జిహెచ్ఎంసి జల్ పల్లి సర్కిల్ పరిధి, శ్రీరామ కాలనీలోని  నారాయణ స్కూల్ లో గురువారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుకలను ఈ చామ్స్ విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ఏజీఎం రవీంద్రబాబు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులే స్వయంగా ఉపాధ్యాయుల స్థానంలో ఉండి తాము నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు వివరించే ఒక ప్రత్యేక కార్యక్రమం అని, విద్యార్థులలో నెలకొన్న భయాన్ని పోగొట్టి నలుగురిలో మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడమే నారాయణ స్కూల్ ఉద్దేశమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల మాటలను విని, వారు ఊహించిన దానికన్నా తమ పిల్లల నైపుణ్యం చాలా బాగుందని విద్యార్థులను మెచ్చుకొని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఈ ఛామ్స్ ఆర్ అండ్ బి మహేశ్వరి, కోఆర్డినేటర్ దివ్య, స్కూల్ ప్రిన్సిపల్ రాజేందర్, ఏఓ రవిబాబు, డీన్ హరిబాబు, వైస్ ప్రిన్సిపాల్ స్నేహ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.                          

 

-   అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.