BREAKING
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ - విద్యార్థి విద్యాసంస్థల అధ్యర్యంలో బతుకమ్మ సంబురాలు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్! చిక్రం శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక సహాయం జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట! రైతుల కష్టాలు చూసి చలించిన మాతృహృదయం.. సొంత ఖర్చులతో డొంక దారి బాగు చేసిన పోకల శ్రీనివాసరావు అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం* మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం

ఓటరు జాబితా ప్రక్షాళనను రాజకీయం చేయొద్దు

Select Suryaa Now
ఓటరు జాబితా ప్రక్షాళనను రాజకీయం చేయొద్దు

ఓటరు జాబితా ప్రక్షాళనను రాజకీయ కోణంలో కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా చూడాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా. వైభవ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ... ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనే సూత్రానికి అనుగుణంగా ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైన ఓట్లను గుర్తించి సరిచేయాల్సిన అవసరముందన్నారు. ఓట్లు తొలగించారంటూ ఆరోపణలు చేసే రాజకీయ పార్టీలు నిర్దిష్ట ఆధారాలతో తమ అభ్యంతరాలను వెల్లడించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హమైన నమోదులకు తావులేకుండా చూడాలని పేర్కొన్నారు. ఓటు తొలగినట్లు భావించే అర్హులు సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి, అవసరమైన గుర్తింపు పత్రాలతో తిరిగి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తొలగించిన ఓట్లన్నింటినీ తిరిగి చేర్చాలనే డిమాండ్ల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శించారు. భారతదేశం ధర్మసత్రం కాదని, దేశ పౌరులకే రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు వర్తిస్తుందని, విదేశీయులు లేదా అనర్హుల పేర్లకు ఓటరు జాబితాలో చోటు ఉండకూడదని డా. వైభవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు, అర్హుడైన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు ఉండాలన్నదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని అన్నారు.

చేవెళ్ల, మేజర్ న్యూస్(అక్టోబర్ 09)