మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన
మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన
చీరాల:మసీదు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం పేరాల రైల్వే గేట్ వద్ద స్థానిక మహిళలు, యువకులు ఆందోళనకు దిగారు. మసీదుకు అతి సమీపంలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనితో కొద్దిసేపు వాహనం రాహుల్ నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది.ఈ ఆందోళనకు దళిత బహుజన సేవా సమితి బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి జిలాని మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, ఇప్పటికే రైల్వే గేట్ సమీపంలో మద్యం దుకాణం ఉండగా, మరో దుకాణం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. మసీదు సమీపంలో మద్యం విక్రయాలకు అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి కొత్త దుకాణం ఏర్పాటును నిలిపివేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు పట్టించుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.