దుర్గామాత విగ్రహా ప్రతిష్టకు ఎమ్మెల్యేకు ఆహ్వానం ...
-విద్యుత్ సమస్యపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే
తలకొండపల్లి మండల కేంద్రంలో ప్రతిష్టించనున్న దుర్గామాత ఆలయ ప్రారంభోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆహ్వానించారు. తలకొండపల్లి గ్రామానికి చెందిన స్థానిక నేత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి తలకొండపల్లి మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పంటలకు సరైన సమయంలో కరెంటు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతుల సమస్యపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వెంటనే స్పందించారు.అక్కడికక్కడే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి మండలంలో నెలకొన్న విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు స్పందిస్తూ త్రీఫేస్ విద్యుత్ సరఫరాను నాణ్యమైన త్రీఫేస్ విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే తక్షణ స్పందన పట్ల మండల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ
కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సత్యం, ఇట్టమోని మల్లేష్ యాదవ్, పోచారం గిరీందర్ రెడ్డి, పుట్ట పాండు, శ్రీకాంత్, పుట్ట భరత్, కటికెల శ్రీకాంత్, హనీమూన్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి, మేజర్ న్యూస్ : తలకొండపల్లి.