సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసినా.... ఎస్పీ నరసింహా ఐపీఎస్.....
_పోలీస్ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ కేసుల దర్యాప్తు శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి ......జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్......_
సూర్యాపేట క్రైమ్ మేజర్ న్యూస్
సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డులను కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. సిబ్బంది విధుల నిర్వహణ తీరును పర్యవేక్షించి విధుల పట్ల వారి అంకితభావాన్ని సమస్యలను తెలుసుకున్నారు. పోలీస్ విధులపై సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని ఆదేశించారు.
*బ్లూ కోట్స్, పెట్రో కార్, డయల్ 112 విధుల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి....* పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్, డయల్ 100 సిబ్బంది నిర్వహించే విధులు అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. విధులు నిర్వహించే ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు రౌడీషీటర్లు సస్పెక్ట్ షీటర్లు అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులు గంజాయి కేసులతో సంబంధం ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
*కేసుల దర్యాప్తులో వేగం పెంచాలి.. బాధితులకు సత్వర న్యాయం అందించాలి:..* పోలీస్ స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల వివరాలను, వాటి దర్యాప్తు పురోగతిని ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కేసులకు సంబంధించిన దస్త్రాలను నేర అభియోగ పత్రాలను నిర్ణీత గడువులోగా న్యాయస్థానాలకు సమర్పించాలని సూచించారు. కోర్టులతో సమన్వయం పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, ఎలాంటి కేసులను అనవసరంగా పెండింగ్‌లో ఉంచకూడదని స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. విధుల నిర్వహణలో నిరంతరం నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ, క్రమశిక్షణతో పనిచేయాలని తెలిపారు. నేరాల నియంత్రణ నేరస్తుల కదలికలపై నిఘాప్రజల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని ఆదేశించారు.
*దసరా, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు..*
రాబోయే దసరా పండుగ, దుర్గామాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సూర్యాపేట పట్టణంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచించారు. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు, ఉత్సవాలను జరుపుకునేలా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు దుర్గామాత మండపాల ఏర్పాటు వివరాలను ముందుగానే స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మండపాల వివరాలు పోలీసులకు అందించినట్లయితే, ఆయా ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ అవసరమైన భద్రతా చర్యలు చేపడతారని తెలిపారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ తనిఖీలో సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.