BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి

Select Suryaa Now
డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి

పలాస, సూర్య : పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి విశేష కృషి చేసిన దివంగత నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కణితి విశ్వనాథం కాంస్య విగ్రహాన్ని కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలిలో ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ శనివారం స్థానిక బీజేపీ నేతలు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, సేవా సంకల్ప అభియాన్ కో-కన్వీనర్ పాలవలస వైకుంఠరావు, పూర్వ పలాస నియోజకవర్గ కన్వీనర్ రామానంద స్వామి ఈ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కణితి విశ్వనాథం పలాస-కాశీబుగ్గకు ఆర్టీసీ కాంప్లెక్స్, 33 కేవీ సబ్ స్టేషన్, రైల్వే స్టేషన్ అభివృద్ధి, పలు ట్రైన్ల హాల్టింగ్ తీసుకురావడంతో పాటు పలాస జిల్లా పరిషత్ హైస్కూల్ ఆటస్థలం కోసం 3 ఎకరాలు, పేద విద్యార్థుల కోసం సొంత నిధులతో భవనం నిర్మించి మరో 3.50 ఎకరాలు, ఐటీఐ కోసం భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నారు.విద్యార్థుల కోసం రూ.2 కోట్లతో హాస్టల్ నిర్మించి ఎందరో ఎస్సీ, ఎస్టీ, పేద విద్యార్థులను సొంత ఖర్చుతో డాక్టర్లుగా తీర్చిదిద్దారని, లయన్స్ గవర్నర్ గా, వైద్యుడిగా విశ్వనాధం ఉచిత సేవలు అందించారని గుర్తు చేశారు. గోవిందపురం (పుండి)లో 5 ఎకరాలు ఉచితంగా ఇచ్చి జడ్పీ హైస్కూల్ తీసుకురావడం ఆయన ఘనత అన్నారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ స్పందిస్తూ.. ఇలాంటి నాయకుడి స్ఫూర్తి నేటి తరానికి అవసరమని, విగ్రహ ఏర్పాటుకు తప్పకుండా స్థలం కేటాయిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు.

 

రిపోర్టర్ : విశ్వేశ్వర, పలాస, శ్రీకాకుళం జిల్లా.