అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో బాలికలకు ఉన్నత విద్యపై అవగాహన
( మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)
అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో సంజీవపురం కస్తూరిబా బాలికల విద్యాలయ విద్యార్థినులకు ఉన్నత విద్య, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. కళాశాల కంప్యూటర్ శాస్త్ర విభాగం, జాతీయ సేవా పథకం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ సందర్భంగా కళాశాల అధ్యక్షుడు అనంతరాముడు మాట్లాడుతూ బాలికల సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఉపాధ్యక్షుడు రమేష్ నాయుడు మాట్లాడుతూ ఉన్నత విద్యపై అవగాహనతో విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. కుటాల శ్రీనివాసులు, విభాగాధిపతి డా. భార్గవి, జాతీయ సేవా పథకం అధికారి మనోహర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.