మంత్రి ఆనం నేటి పర్యటన రద్దు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ప్రత్యేక కేబినెట్ సమావేశం నేపథ్యంలో శనివారం అనంతసాగరం, సంగం మండలాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పర్యటన రద్దయిందని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి రేపు శనివారం అనంతసాగరం మండలంలోని పాత దేవరాయపల్లి, పాతాళపల్లి గ్రామాలు మరియు సంగం మండలంలోని చెన్నవరప్పాడు గ్రామాల్లో పర్యటించేలా నిర్ణయించారని, అయితే అత్యవసర అధికారిక పనుల నిమిత్తం అమరావతిలో నిర్వహించనున్న ప్రత్యేక కేబినెట్ సమావేశానికి మంత్రివర్యులు హాజరుకావాల్సి ఉన్నందున నియోజకవర్గ పర్యటన మరియు ఆయా గ్రామాల్లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు రద్దు చేయడమైనదన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలో తెలియజేయడం జరుగుతుందన్నారు. కావున సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఈ షెడ్యూల్ మార్పును గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నామని
మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రతినిధులు తెలిపారు.