బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
అవనిగడ్డ, మేజర్ న్యూస్: బాల్యవివాహాలను నిర్మూలించి, ఆడపిల్లల అభివృద్ధికి బాటలు వేయాలనే లక్ష్యంతో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు, జిల్లా బాలల సంరక్షణ విభాగానికి చెందిన ప్రేమ, చంద్రమ్మ, భవాని పాల్గొన్నారు. వీరితో పాటు అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు చెందిన మండల మహిళా సాధికారత కేంద్రాల ప్రతినిధులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలికల విద్య, అభివృద్ధి ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా